NDL: మండల కేంద్రమైన రుద్రవరంలోని ఆయా కాలనీలలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మనోహర్, వైద్య బృందం, మండల స్థాయి అధికారుల బృందంతో సందర్శించారు. పలు కాలనీలను సందర్శించిన అధికారులు తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, తదితర వాటిని పరిశీలించారు. ఎస్సీ కాలనీ డయేరియా బారిన పడిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు.