NDL: నందికొట్కూరు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ సీఐటీయూ రాష్ట్ర వ్యాప్త నిరసన పిలుపులో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ బేబీకి అందజేయడం జరిగింది. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, పరమేష్,శ్రీనివాసులు, నాగన్న ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.