యావత్ ప్రపంచం భారత్ వైపు ఆశగా చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్తో కలిసి అభివృద్ధి పథంలో నడిచేందుకు బ్రిక్స్ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఏటా 90 వేల వీసాలు ఇస్తామని జర్మనీ చెప్పిందన్నారు. అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం మన చేతుల్లో ఉందని పేర్కొన్నారు.