VZM: గ్రామ సభలలో ఆమోదం పొందిన ఉపాధి పనులన్నిటినీ బుధవారంలోగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ మండల అధికారులకు ఆదేశించారు. జనవరి నాటికి పనులన్నిటినీ ప్రారంభించవలసి ఉన్నందున అత్యంత ప్రాధాన్యత నిచ్చి ఈ పనులను పూర్తి చేయాలనీ సూచించారు. సోమవారం మండల అభివృద్ధి అధికారులతో, ఈ.వో.పీ.ఆర్.డీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.