AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ తమిళ నటుడు పార్థిబాన్ భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వీరిద్దరూ కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ఎక్స్‌లో షేర్ చేసింది. మర్యాదపూర్వక భేటీ జరిగినట్లు పేర్కొంది. కాగా.. వారిద్దరి భేటీకి అసలు కారణం తెలియాల్సి ఉంది.