MLG: ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామ శివారులో ఆదివారం కోడి పందాలు ఆడుతున్నారని పక్కా సమాచారం రావడంతో వారిపై పోలీసుల దాడులు నిర్వహించారు. దాడుల్లో పలువురు పందెం రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 4500 నగదు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.