కోనసీమ: దీపావళి పండగ నేపథ్యంలో బాణసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి అని రాజోలు ఎస్ఐ బీ.రాజేష్ కుమార్ తెలిపారు. ఆదివారం తమ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా బాణసంచా పేలుళ్లు జరగకుండా ప్రశాంతంగా దీపావళి పండగ చేసుకునేలా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇసుక, ఫైర్ ఇంజిన్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు.