KNR : జాతీయ స్థాయి యోగా పోటీలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పి. దీపక్ సబ్ జూనియర్ విభాగంలో పసిడి పతకం పొంది రికార్డ్ సృష్టించాడు. హిమాచల్ ప్రదేశ్ లోని ఉనాలో ఈనెల 24 నుండి 27 వరకు ఈ పోటీలు నిర్వహించగా.. తెలంగాణ యోగా అసోసియేషన్ చరిత్రలోనే సబ్ జూనియర్ విభాగంలో తొలిసారిగా దీపక్ గోల్డ్ మెడల్ సాధించాడు.