అన్నమయ్య: నిమ్మనపల్లె మండలం, రాచవేటి వారి పల్లె గ్రామ పంచాయితీ గొల్లపల్లె కాలనీలో మౌలిక వసతులు సత్వరం కల్పించాలని స్థానిక ప్రజలు కోరారు. ఆదివారం గొల్లపల్లె కాలనీలోని పలువురు ప్రజలు మాట్లాడుతూ.. రోడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. మురుగునీరు వల్ల దుర్గంధం, దోమలు ఎక్కువ అయ్యి అనారోగ్యాల పాలు అవుతున్నామని తెలిపారు.