TG: హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సదర్ సమ్మేళనం ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఆనాడే చెప్పానన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో యాదవులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తానని సీఎం తెలిపారు. నగర అభివృద్ధికి యాదవ సోదరులు అండగా నిలబడాలని కోరారు. యాదవులు ధర్మంవైపు నిలబడాలని పేర్కొన్నారు.