NLR: అనంతసాగరం మండల ఉపాధి ఏపీవో దయాసాగర్, కంప్యూటర్ ఆపరేటర్ జమీర్‌కు విజిలెన్స్ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. బొమ్మవరంలో ఉపాధి హామీ పనుల నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వాళ్ళు తెలిపారు. వారం రోజుల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందించకుంటే ఏపీఓపై పూర్తి స్థాయిలో సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది.