టీమిండియా 2024 క్యాలెండర్ ఇయర్లో ఒక్క వన్డే మ్యాచ్ను గెలవకుండానే ముగించనుంది. ఈ ఏడాది భారత్ కేవలం మూడు వన్డే మ్యాచ్లను మాత్రమే ఆడింది. శ్రీలంకతో జరిగిన ఆ మూడు మ్యాచ్లలో రెండు మ్యాచ్లు ఓడి, ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది. త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్లలో టీ20, టెస్ట్లు మాత్రమే ఆడనుంది. దీంతో 2024లో ఒక్క వన్డే మ్యాచ్లోనూ భారత్ విజయం నమోదు చేయలేకపోయింది.