SKLM: కోటబొమ్మాళి-నిమ్మాడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైన ఆదివారం వేకువజామున ముందు వెళుతున్నా లారీని వెనుక నుండి ఇంకో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. పోలీసులుఈ ఘటనపై కేసు నమోదు చేశారు.