NLG: R&B,ఫారెస్ట్ అధికారులతో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఛాంబర్లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అటవీ అనుమతులు లేక ఆగిపోయిన రోడ్ల నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. అటవీ అనుమతులకు ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు మరింత వేగంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్ ఉన్న పనులను వేగవంతం చేశారు.