సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్‌లో భారత జూనియర్ హాకీ జట్టు కాంస్యంతో గర్జించింది. భారత్ 3-2 (పెనాల్టీ షూటౌట్)తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్ల గోల్స్ 2-2తో సమం కావడంతో పెనాల్టీ షూటౌట్ తప్పనిసరైంది. షూటౌట్లో గుర్జ్యోత్సింగ్, మన్మీత్సింగ్, సౌరభ్ ఆనంద్ గోల్స్ చేశారు.