ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు ఛాన్స్ వచ్చినట్లు కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. కాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి దీనిపై కార్లీటీ ఇచ్చింది. ఈ సినిమా కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదని, అదొక అందమైన రూమర్ మాత్రమేనని చెప్పింది. కానీ ఎన్టీఆర్‌తో నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని, వెంటనే ఒప్పుకుంటానని చెప్పుకొచ్చింది.