»Ec Allots Shiv Sena Name Bow And Arrow Symbol To Eknath Shinde
EC allots Shiv Sena name to eknath shinde:షిండేదే అసలైన శివసేన, ఈసీ గుర్తింపు.. గుర్తులు
EC allots Shiv Sena name to shinde:శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే ( bal Thakeray) కుమారుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరేకు ( Uddhav Thakeray) కేంద్ర ఎన్నికల సంఘం (ec) షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేదే (ekanth shinde) అసలైన శివసేన అని అధికారికంగా గుర్తించింది.
EC allots Shiv Sena name to shinde:శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరే ( bal Thakeray) కుమారుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాకరేకు ( Uddhav Thakeray) కేంద్ర ఎన్నికల సంఘం (ec) షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేదే (ekanth shinde) అసలైన శివసేన అని అధికారికంగా గుర్తించింది. ధనుస్సు (bow), బాణం (arrow) గుర్తులు కూడా షిండే వర్గానికి కేటాయించింది. శివసేన పార్టీలో సంక్షోభం ఏర్పడి అసమ్మతి వర్గం నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. థాకరే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. అప్పటినుంచి తమదే అసలైన శివసేన అని ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ థాకరే వర్గాలు ప్రకటించుకున్నాయి. సమస్యను పరిష్కరించేంత వరకు ఇరువర్గాలు వేర్వేరు గుర్తులు ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది.
ఈసీ తాజా నిర్ణయంతో సీఎం ఏక్ నాథ్ షిండే (eknath shinde) హర్షం వ్యక్తం చేశారు. ఇది శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే భావజాలం సాధించిన విజయం అని అభివర్ణించారు. ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ప్రాతిపదికగా తీసుకుంటారని స్పష్టం చేశారు. తమదే నిఖార్సయిన శివసేన (shivasena) అని తేలిందని పేర్కొన్నారు. బాలాసాహెబ్ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకునే తాము గతేడాది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని షిండే వివరించారు.
ఏ ప్రాతిపదికన శివసేన (shivasena) పార్టీపై నిర్ణయం తీసుకున్నామనే విషయాన్ని ఈసీ వెల్లడించింది. 2019 ఎన్నికల్లో శివసేన పార్టీ తరఫున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేలు 76 శాతం ఓటింగ్ సాధించారని, వారందరి మద్దతు ఏక్ నాథ్ షిండేకు ఉందని వివరించింది. ఉద్ధవ్ థాకరే వర్గం ఎమ్మెల్యేలకు 23.5 శాతం మాత్రమే ఓటింగ్ లభించిందని పేర్కొంది. ఈసీ నిర్ణయంపై ఉద్దవ్ థాకరే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈసీ నిర్ణయం ఊహించినదేనని, తాము కొత్త గుర్తుతో ముందుకెళతామని వెల్లడించారు. దీంతో తామేమీ బాధపడటం లేదన్నారు. ప్రజలతో తమ వెంటే ఉన్నారని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. శివసేన ఎవరిదో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు.
షిండే వర్గానికి శివసేన పార్టీ, గుర్తును ఎన్నికల సంఘం కేటాయించడంపై ఉద్దవ్ థాకరే స్పందించారు. ఇదీ ప్రజాస్వామ్యాన్ని హత్యకు గురి చేయడమేనని అన్నారు. ఓ ద్రోహికి పార్టీని, గుర్తును ఎలా కేటాయిస్తారని ఆయన అడిగారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని కోరారు. దీనిపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.