TG: CM రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో బెటాలియన్ పోలీసులకు 15 రోజుల్లో 4 రోజులు కుటుంబంతో ఉండేలాగా KCR నిర్ణయం తీసుకున్నారని.. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత నెలకు 4 రోజులు మాత్రమే ఉండేలా మళ్లీ పాత రూల్ తెచ్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఏక్ పోలీస్ వ్యవస్థను తీసుకొస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనీసం దాని పక్కకు కూడా చూడటం లేదని విమర్శించారు.