NLR: కోవూరు ఇనమడుగులోని శ్రీ రామ కృష్ణనంద ఆశ్రమం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆశ్రమం ఎదురుగా ఉన్న పొలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆక్రమణదారుడు తన పొలానికి వెళ్ళడానికి ఆశ్రమానికి చెందిన గోశాల అడ్డుగా ఉందని అది కూల్చి దారి ఇవ్వాలని అధికారులను కోరారు.