టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా తన నటనతో మంచిపేరు సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు IAS అవ్వాలని కోరుకుందట. ‘నా జీవితంలో నేను అనుకున్నది ఎప్పుడూ జరగలేదు. చదువు విషయంలో టాపర్గా ఉన్నా దేవుడు ఆ అవకాశం కల్పించలేదు’ అని పేర్కొంది. ‘హీరోయిన్ కావడం కష్టమేమీ కాలేదు. కానీ ప్రపంచంలో భద్రత లేని ఉద్యోగం ఏదైనా ఉందంటే అది సినీరంగమే’ అంటూ రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.