వరుణ్ ధావన్- సమంత ప్రధాన పాత్రల్లో రూపొందించిన సిరీస్ ‘సిటాడెల్’. OTT ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 7 నుంచి ప్రసారం కానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న డైరెక్టర్స్ రాజ్, డీకేలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సిటాడెల్’ తమ గత సిరీస్ ‘ది ఫ్యామిలీమ్యాన్’కు భిన్నంగా ఉంటుందని వెల్లడించారు.