NLR: రాపూరు మండలం వెలుగోను గ్రామంలో భూ రీసర్వే గ్రామ సభలను ఇవాళ తహశీల్దార్ లక్ష్మి నరసింహం నిర్వహించారు. ఈ సమావేశంలో భూ సమస్యలు ఉన్న రైతులు ప్రజలు పాల్గొన్నారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటి వరకు 8 పంచాయతీలో గ్రామసభలు నిర్వహించగా 98 అర్జీలు అందాయని, అందిన అర్జీల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు.