BDK: రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం సుజాతనగర్ మండలంలో 1262 రకం నకిలీ వరి విత్తనాలు వేసి నష్టపోయిన రైతుల పంటపొలాలు పరిశీలించారు. దాదాపు 150 మంది రైతులు వందలాది ఎకరాలలో పంట నష్టపోవడం జరిగిందని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చండ్ర నరేంద్ర కుమార్, ముత్యాల విశ్వనాథం అన్నారు. తక్షణమే నకిలీ విత్తనాల బారిన పడిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.