AP: విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్తుల కోసం కన్నతల్లిని కోర్టుకు లాగిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. వైసీపీ కోసం తాను చాలా చేశానని, తన కోసం జగన్ ఏం చేశారని నిలదీశారు. గిఫ్ట్ ఇవ్వడం కోసం ఎవరైనా ఎంఓయూ చేస్తారా అని, మరి సరస్వతి షేర్లలో ఎంఓయూ ఎందుకు చేశారని ప్రశ్నించారు.