WGL: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చిర్ర నర్సింగ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కాజీపేట మున్సిపల్ సర్కిల్ అసిస్టెంట్ కమీషనర్‌కు బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతి పత్రంను అందజేశారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలును మర్చిపోయిందని విమర్శించారు.