న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీంఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మొదటి టెస్టులో ఓటమిపాలైన భారత్ రెండో టెస్టులోను అదే పంథాలో ముందుకు పోతుంది. 359 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు దిగిన ఇండియా టీ బ్రేక్‌కు కీలకమైన ఏడు వికెట్లను కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో భారత్ గెలుపు గాల్లో దీపంలా మారింది. ఇదిలా ఉంటే మూడు వికెట్లు తీస్తే సిరీస్ కివీస్ సొంతం అవుతోంది.