TG: మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దీపావళికి ముందే 100% బాంబులు పేలుతాయి. ఆ బాంబులు కాంగ్రెస్‌లోనే పేలబోతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ముందే పసిగట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తలోదారి అయ్యారు. ప్రజల దృష్టి మళ్లించటం కోసమే ఈ డ్రామాలన్నీ. సీఎం రేవంత్‌కు రాహుల్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. ఎవరి కుర్చీలు కదులుతాయో త్వరలో చూస్తారు’ అని అన్నారు.