స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప 2’. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. అయితే ఈ సినిమాను ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో 5 వేల స్క్రీన్స్, ఇండియాలో 6500 స్క్రీన్స్‌లో విడుదల చేస్తున్నారట. దీంతో ‘పుష్ప 2’ బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించనుంది.