KMM: ముదిగొండ మండలం ముత్తారం మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద శనివారం కార్మికుల ఆందోళన చేపట్టారు. మండలంలో గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిపివేసి ఆందోళన చేపట్టినట్లు కార్మికులు తెలిపారు. 7 నెలలుగా జీతాలు లేవని మిషన్ భగీరథ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఇవ్వకుండా కార్మికులను గుత్తేదారు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.