AP: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని CM చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించాలని సీఎం పిలుపునిచ్చారు. కాగా, రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇవ్వనున్నారు. రూ.100తో గతంలో సభ్యత్వం తీసుకున్న వారికి బీమా రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే అంత్యక్రియలకు ఆరోజే రూ.10 వేలు అందించనున్నారు.