తమిళ స్టార్ సూర్య హీరోగా డైరెక్టర్ శివ తెరకెక్కించిన మూవీ ‘కంగువ’. నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ సీక్వెల్‌పై నిర్మాత KE జ్ఞానవేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కంగువ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయి. 2026లో దీని షూటింగ్ పూర్తి చేస్తాం. 2027లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తాం’ అని చెప్పారు.