ఉక్రెయిన్ ‘నాటో’ కూటమిలో చేరితే ఏం చేయాలో తమకు తెలుసాని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. రష్యా అధికారిక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో ఉత్తరకొరియా దళాలను ఉపయోగించాలా? వద్దా? అన్నది తర్వాత నిర్ణయిస్తామని తెలిపారు. ఒక వేళ ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే రష్యా తన సామర్థ్యాన్ని నిరుపించుకునేందుకు ఏం చేయాలో అది చేస్తుందని చెప్పారు.