చెన్నైలోని తిరువొత్తియూర్ సమీపంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు గ్యాస్ లీక్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపుగా 30 మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు మొదట ఏదో ఘాటైన వాసన వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత మైకము, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. అయితే, ఈ ఘాటైన వాననకు గల కారనాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు.