బంధన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా పార్ధ ప్రతిమ్ సేన్ గుప్తా వచ్చేనెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. బంధన్ బ్యాంకు ఈ మేరకుఓ ప్రకటనలో తెలిపింది. ప్రతిమ్ సేన్ గుప్తా నియామకానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. దీంతో బ్యాంకు డైరెక్టర్ల బోర్డు సమావేశం పార్ధ ప్రతిమ్ సేన్ గుప్తాను బ్యాంకు ఎండీ కం సీఈఓగా నియమించేందుకు ఆమోదం పొందింది. ఈ పదవిలో ఆయన మూడేండ్ల పాటు కొనసాగుతారు.