ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్ టీ20 క్రికెట్ టోర్నీ ఫైనల్కు అఫ్గానిస్థాన్ ‘ఎ’ జట్టు దూసుకెళ్లింది. భారత్ ‘ఎ’తో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఫైనల్లో అఫ్గాన్ జట్టు శ్రీలంకతో తలపడుతుంది.