AP: ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. సదాశివనగర్ మండలం పద్మాజీవాడి చౌరస్తా వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటన నుంచి పాయల్ శంకర్ సురక్షితంగా బయటపడగా.. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటన అనంతరం మరో కారులో ఎమ్మెల్యే ఆదిలాబాద్ వెళ్లారు.