KDP: బ్రహ్మంగారిమఠం మండలం పాపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన జవాన్ కే. రాజేష్ ఇటివల నక్సలైట్ కాల్పులలో వీర మరణం పొందారు. వారి కుటుంబాన్ని శుక్రవారం ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కే విశ్వనాథ్ మాదిగ పరామర్శించి, నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం జవాన్ కుటుంబానికి అన్యాయం చేశారని, అందవలసిన బెనిఫిట్స్ ప్రకటించడంలో జాప్యం చేయడంపై మండిపడ్డారు.