NZB: మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లలో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఏటీసీ భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు.