సత్యసాయి: నల్లచెరువు మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై కదిరి సహాయ సంచాలకులు సత్యనారాయణ అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. పౌరులు అడిగిన సమాచారాన్ని 30 రోజులలోపు వారికి అందించాలని కోరారు. దరఖాస్తు దారుడికి 30 రోజులలోపు సమాచారం ఇవ్వకుంటే పై స్థాయి అధికారులకు తిరిగి దరఖాస్తు చేస్తారని తెలిపారు.