VZM: నెల్లిమర్ల నియోజకవర్గం జరజాపు పేట గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి వనం నందు ప్రతిమ ప్రతిష్ఠ మహోత్సవంలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు విక్రమ్‌కు శాలువా కప్పి, సాదర స్వాగతం పలికారు. ముత్యాలమ్మ వారికి పూజాధికాలు జరిపించారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.