JGL :ఇంటర్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిలబస్ ఎంత మేరకు పూర్తి చేశారని లెక్చరర్లను అడిగి తెలుసుకున్నారు. ఎంసెట్ తరగతులు ప్రారంభించాలని లెక్చరర్లకు సూచించారు.