ప్రకాశం: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం డివైఎఫ్ఐ నాయకుల సమావేశం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కె.వి పిచ్చయ్య మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో ప్రకాశంలో ఎస్జీటీ, అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయని అన్నారు. అధికారులు ఖాళీలను చూపించలేదన్నారు. త్వరలో వచ్చే నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు.