NLR: కావలి పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది పాతపాటి వెంకట రమణారెడ్డి విజయవాడ డివిజన్ పరిధిలోని కావలి రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా నియామకం కావడంపై కావలి బీజేపీ, జనసేన నేతలు హర్షం వ్యక్తం చేశారు. వారు రమణారెడ్డిని ఘనంగా సన్మానించారు. రమణారెడ్డి మాట్లాడుతూ.. కావలి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.