రకరకాల డిజైన్లతో పచ్చబొట్టు వేసుకోవడం ఇటీవల కొందరు ఫ్యాషన్‌గా భావిస్తారు. కానీ, పచ్చబొట్టు వేసుకున్న వారు రక్తదానం చేయొద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని వల్ల శరీరంలో అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దీంతో రెడ్‌క్రాస్ నిబంధనలు విధించింది. పచ్చబొట్టు వేసుకున్న వారు ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా రక్తదానం చేయొద్దు. అలాగే, పచ్చబొట్టు వేసేవారు కొత్త సూదులు, పరికరాలు మాత్రమే వాడాలని హెచ్చరించింది.