NTR: నూజివీడు పట్టణంలోని బ్యాంక్ స్ట్రీట్లో గల పోస్ట్ ఆఫీస్ వద్ద గ్రామీణ డాక్ సేవకు యూనియన్ ఆధ్వర్యంలో సిబ్బంది నిరసన కార్యక్రమం శుక్రవారం 3వ రోజుకు చేరుకుంది. యూనియన్ సెక్రటరీ పి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.