NTR: ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కార దిశలో భాగంగా విజయవాడ ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ ఉమామహేశ్వరరావు సిబ్బందితో విజయవాడలోని కాలేశ్వరరావు మార్కెట్, గద్ద బొమ్మ తదితర ప్రాంతాల్లో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా రహదారిని ఆక్రమించిన వ్యాపార సముదాయాలను క్రమబద్ధీకరించారు.