AP: వినియోగదారులకు నిరంతరం ఇసుక సరఫరా చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. కొవ్వూరు మండలం వాడపల్లిలో ఆయన పర్యటించారు. అక్కడ ఉన్న ఇసుక ర్యాంపులను పరిశీలించారు. ఇసుక నిల్వలపై కలెక్టర్, గనులశాఖ ఏడీని అడిగి తెలుసుకున్నారు. ఇసుక సరఫరాలో అధికారులు తాత్సారం చేస్తున్నారని బోడ్స్మెన్ ప్రతినిధులు వెల్లడించారు.