NLR: అనంతసాగరం మండలం నల్లరాజుపాలెం వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి సోమశిల ఉత్తర కాలువలో బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఆత్మకూరుకు చెందిన ట్రాక్టర్ మెకానిక్ సాదిక్ అలియాస్ బాబుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.