TG: HYDలో నకిలీ iPhoneలు విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్లో తనిఖీలు చేసి రూ.3 కోట్ల నకిలీ iPhone పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. టార్గెట్, పటేల్, ఆశాపూర్, నంది మొబైల్ షాపుల్లో చైనా మేడ్ ఫోన్లకు iPhone స్టిక్కర్ అంటించి అమ్ముతున్నట్లు గుర్తించారు. కొన్ని నెలలుగా నిందితులు యాపిల్ బ్రాండ్ పేరుతో దందా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.