NRML: సారంగాపూర్ మండలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారి శుక్రవారం తెలిపారు.పెద్దపులి సంచరిస్తూ మేకలపై ఆవులపై దాడి చేస్తుందని తెలిపారు. కావున వారం రోజులు గుంపులు గుంపులుగా వ్యవసాయ పనులకు వెళ్లాలని తెలిపారు. ప్రధానంగా పశువుల కాపరులు, గొర్ల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.పెద్దపులి కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.